పెళ్లి కూతురు గెటప్ లో సమంత.. వైరల్ అవుతున్న వీడియో..!?

Anilkumar
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరు కలిసి నడుస్తున్న సినిమా ఖుషి.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ అందించిన నా రోజా నువ్వే పాట ఎంతటి మంచి రెస్పాన్స్ కనబరిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అందరి నోటా ఇదే పాట వినిపిస్తోంది.

 అంతేకాదు యూట్యూబ్లో సైతం ఈ పాట రికార్డ్ను క్రికెట్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం కృషి శర్మ కి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. కేరళ మరియు రామోజీ ఫిలిం సిటీ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ని నిర్వహిస్తున్నారు చిత్రబంధం. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశకి చేరుకుంది. తాజాగా కాకినాడ ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చివరి దశ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆలయంలో విజయ్ మరియు సమంతలపై క్లైమాక్స్ ఎపిసోడ్ ని చిత్రీకరించారు.

 ఇక అందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. కాగా ఆ వీడియోలో సమంత రెడ్ కలర్ చీరలో అచ్చం పెళ్ళికూతురు లాగా కనిపిస్తోంది. ఇక ఆ వీడియోలో కుటుంబ సభ్యులంతా కలిసి యాగం చేస్తున్నారు. సమంత రెడ్ కలర్ చీరలో విజయ్ పంచ కట్టులో కనిపిస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ నమస్కారం పెట్టారు. మురళీ శర్మ సచిన్ కెడేకర్ సైతం అందులో కనిపించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో వారిద్దరూ భార్య భర్తలు గా కనిపించారు. అంతేకాదు సమంత సైతం సెట్స్ నుండి ఒక సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అంతేకాదు ఇందులో సమంత తన మెడలో నల్లపూసలైన సైతం వేసుకుంది. కాగా సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: