మరోసారి వైరల్ అవుతున్న తమన్నా హాట్ లుక్ ఈ సారి ఏకంగా అలా..!?

Anilkumar
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటిస్తోంది.. అయితే ఈ సినిమా నుండి మేకర్ ఇప్పటికే తమన్న లుక్ ని విడుదల చేయడంతో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ గా మారింది.. అయితే జైలర్ ఫస్ట్ సింగిల్ కావాలా సాంగ్ ను జూలై 6న విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే ఇందులో భాగంగా తమన్న నాతో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా అంటూ ఒక పోస్ట్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 


అయితే సాంగ్ విడుదల కంటే ఒకరోజు ముందే ఆ సాంగ్లో తమన్నా హాట్ లుక్ ని విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఈ సాంగ్ జులై 6న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లుగా సన్ పిక్చర్స్ ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ క్రమంలోని తాజాగా విడుదలైన తమన్నా పోస్టర్లో తమన్నా అదిరిపోయే స్టెప్పులతో చాలా హాట్ డాన్స్ చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు మేకర్. ఇక జైలర్ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ టాలీవుడ్ యాక్టర్ సునీల్ కన్నడ స్టార్ హీరో శివకుమార్


 రమ్యకృష్ణ మరియు యోగి బాబు వంటి చాలామంది కీలక పాత్రల్లో మనకి కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే జైలర్ సినిమా నుండి మేకర్స్ లాంచ్ చేసిన మోహన్ లాల్ మరియు సునీల్ తమన్నా లుక్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల తమన్నా చీకర్త లాస్ట్ స్టోరీస్ వంటి రెండు వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయింది. ఇక దానికి ముఖ్య కారణం ఇందులో ఆమె నటించిన బోల్డ్ సన్నివేశాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: