మంచు మనోజ్,మౌనికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి..!?

Anilkumar
ఈ రోజుల్లో అందరూ ప్రేమించుకుంటున్నారు. కానీ అది పెళ్లి వరకు తీసుకెళ్లడం అన్నదే పెద్ద సమస్య. కానీ ఆ ప్రేమ స్వచ్ఛమనేదైతే కచ్చితంగా పెళ్లి వరకు వెళుతుంది. అయితే మంచు మనోజ్ మరియు భూమ మౌనికలు సైతం ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. దశాబ్దానికి పైగా పరిచయం నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి  పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే వీరిద్దరికీ కూడా ఇది రెండవ పెళ్లి. ఈ కుటుంబాలు విభిన్న వర్గాలకు చెందినవారు. అందుకే ఈ ఈ పెళ్లిని పెద్దలు ఒప్పుకుంటారా లేదా అని మొదట్లో అందరూ కంగారు పడ్డారు. అందరికంటే ఎక్కువగా కంగారు పడింది మాత్రం మంచు లక్ష్మి అని చెప్పాలి.

అయితే తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నాకు ఏ సహాయం కావాలన్నా ముందుగా చేసేది మనోజ్.. గతంలో యాదాద్రి కి వెళ్ళినప్పుడు మనోజ్ మౌనికకు ఇద్దరికీ పెళ్లి చేయ దేవుడా నా వల్ల కావడం లేదు మా నాన్నని ఒప్పించడం  నావల్ల కావడం లేదు అంటూ వేడుకున్నాను.. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే రెండు కుటుంబాలకు ఒక చరిత్ర ఉంది.. దీంతో మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న సందేహం అందరిలోనూ కలిగింది..

కానీ జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం వారిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య.. కుదిరితే ఆశీర్వదించాలి.. కానీ విడగొట్టడం ఎందుకు.. ఎలాగో అలా వారిద్దరికీ పెళ్లి చేసేసాను అనంతరం వాళ్ళిద్దరిని యాదాద్రి కి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను..ఆయన నా మాట విన్నాడని నాకు అనిపించింది... చాలా సంతోషం వేసింది పెళ్లి వరకు ఇద్దరూ నాతోనే ఉండేవారు పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని ఇప్పుడు అందులోనే ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్ చేసి ఇది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి అని మౌనిక నన్ను ఎప్పుడూ అడుగు ఉంటుంది.. అలా ఫోన్ చేసినప్పుడల్లా నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా ఎలాగైనా చేసుకోపో అని ఆమెని టార్చర్ పెడుతూ ఉంటాను.. కానీ తనకు చాలా ఓపిక ఎక్కువ..నాకు పిల్లలంటే చాలా ఇష్టం ముగ్గురు నలుగురిని కనాలి అని అనుకున్నాను.. కానీ ఆ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: