అలా జరగడం వల్ల ప్రేమలో పడ్డ కాజల్ -కిచ్లు....!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారి మంచి అభిమానాన్ని సంపాదించుకుంది. ఇక ఈమె మంచి హోదాలో ఉన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను ప్రేమించి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకుంది. ఇక అతడు ఒక ప్రముఖ వ్యాపారవేత. పలు బిజినెస్ లు సొంతంగా నడిపిస్తూ ఉంటాడు. ఇక ఈ జంట ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక బాబు పుట్టి ఏడాది కూడా పూర్తయింది. ఇక కాజల్ కూడా ఆమధ్య బాబు కోసం సినిమాలకు బ్రేక్ తీసుకొని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెట్టింది. దీంతో వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం బాలయ్య తో ఒక సినిమా చేస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కాజల్ భర్త గౌతమ్ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే అతడు కాజల్ కంటే ముందు ఒక స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడట. ఇక ఆమెతో కొంత కాలం డేటింగ్ కూడా చేశాడట గౌతమ్. ఇక ఈ విషయం కాజల్ కు కూడా తెలుసని తెలిసింది. అయితే కాజల్ గౌతమ్ తో చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ గా ఉన్నా కూడా వారి మధ్య ఆ సమయంలో అటువంటి ఫీలింగ్ లేదని తెలిసింది. గౌతమ్ ఆ స్టార్ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించగా ఆ హీరోయిన్ మాత్రం గౌతమ్ ఇచ్చిన డబ్బులను వాడుకొని చివరికి గౌతమ్ కు హ్యాండ్ ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకుందట. దీంతో గౌతమ్ ఆ సమయంలో చాలా డిప్రెషన్ కి గురయ్యాడని.. ఆ సమయంలో ఫ్రెండ్ గా ఉన్న కాజల్ అతనికి దగ్గర అవ్వగా అలా కొంతకాలం వారిద్దరు ప్రేమలో ఉండి రెండేళ్ల కిందట కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు గౌతమ్ కాజల్ తో చాలా సంతోషకరమైన లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పాలి. అంతేకాకుండా కాజల్ కు కూడా సినిమాల పరంగా మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం వల్ల అన్యోన్యంగా ఉంటున్నారు.