ఆ కారణంగానే బాలయ్య మార్కెట్ పెరిగిందా....??
లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు కూడా అప్పట్లో రూ.40 కోట్లు దాటలేదు. ఆ తర్వాత శాతకర్ణి కూడా రూ.45 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అలాంటిది అఖండ మాత్రం కరోనా సమయంలో వచ్చి ఏకంగా రూ.120 కోట్ల గ్రాస్.. రూ.75 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ కూడా షాక్ అయిపోయింది. అసలు ఈ రేంజ్ కలెక్షన్లు ఏంట్రా నాయనా.. ఇది బాలయ్య సినిమానేనా అనే అనుమానాలు కూడా వచ్చాయి. పైగా పుష్ప లాంటి సినిమా వచ్చినా కూడా దాన్ని తట్టుకుని నిలబడింది అఖండ. ఇక ఈ ఏడాది వచ్చిన వీరసింహారెడ్డి కూడా అంతే. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య ఉన్నా.. దానికి ఫుల్ పాజటివ్ టాక్ వచ్చి.. తన సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా బాలయ్య మాత్రం తగ్గలేదు. దీనికి కూడా రూ.130 కోట్ల గ్రాస్ వచ్చింది. మొదటిరోజే రూ.64 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది వీరసింహారెడ్డి. దీన్నిబట్టి బాలయ్య రేంజ్ అర్థమైపోతుంది కదా.
ఇప్పుడు భగవంత్ కేసరిపై కూడా అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కలిపి దాదాపు రూ.150 కోట్లు జరుగుతుంది. అందులోనే డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కారణం బాలయ్య ఏజ్‌కు తగ్గ పాత్రలు చేస్తుండటమే. వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే.. ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు బాబీ సినిమాలోనూ 70 ఏండ్ల వ్యక్తిగా నటించబోతున్నారు బాలయ్య. అనిల్ రావిపూడి సినిమాలోనూ బాలయ్య మధ్య వయస్కుడిగానే నటిస్తున్నారు. మొత్తానికి బాలయ్య ఈ తరహా పాత్రలు చేస్తుండటంతోనే ఈ మధ్య సక్సెస్ రేషియోతో పాటు మార్కెట్ కూడా డబుల్ అయిపోయిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి.