ఆ థియేటర్ లో 175 రోజులు పూర్తి చేసుకున్న బాలయ్య బాబు మూవీ....!!
వీర సింహా రెడ్డి సినిమా 175 రోజులను ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో ఆలూరు ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహా థియేటర్ లో.ఇప్పుడు 175 రోజులను పూర్తీ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ రివ్యూలతో కూడా సంక్రాంతి హెల్ప్ తో ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన వీర సింహా రెడ్డి మొత్తం మీద బాలయ్యకి బాక్ టు బాక్ హిట్స్ పడేలా చేసింది.ఈ మూవీ టైం లో ఒక వైపు మెగాస్టార్ మూవీ కూడా విడుదలయి ఆ మూవీ కూడా హిట్ అవ్వడంతో బాలయ్య బాబు అభిమానుల్లో కొంచం భయాందోళనలు స్టార్ట్ ఐయ్యాయి. ఐతే ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న తన కొత్త సినిమా భగవంత్ కేసరి సినిమాతో దసరాకి సందడి చేయబోతున్నాడు. ఆ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.