ప్రాజెక్ట్-k నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆరోజు ఫాన్స్ కి పండగే..!!

Divya
మహానటి ఫెమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీ బ్యానర్ పై తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో హీరోగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తూ ఉండగా ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే నటిస్తోంది.. అలాగే మరొక హీరోయిన్ దిశాపటాని తో పాటు కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ నటించగా .. విలన్ పాత్రలో కమల్ హాసన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం నుంచి ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను సైతం చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజగా ఒక అప్డేట్ను సైతం విడుదల చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా విడుదల కాకముందే ఒక అరుదైన గౌరవాన్ని సైతం అందుకుంటోంది .గత కొద్ది రోజుల నుంచి ప్రాజెక్ట్ -K సినిమా విషయంలో టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతోంది అనే విషయం వినిపిస్తూనే ఉంది ఈనెల 20వ తేదీన రివిల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.


శాన్ డియాగో కామిక్ కాన్ (SDCC) ఈ వేడుకలలో భాగంగా ప్రాజెక్ట్-K సంబంధించి టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్మెంట్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు మాత్రం ఇలాంటి ఘనత అందుకోలేదని తెలుస్తోంది.అమెరికాలో జూలై 19వ తేదీన ఈ వేడుకలు ప్రారంభం కాగా 20వ తేదీన ప్రాజెక్ట్-K చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ ను రివిల్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: