సలార్ నిర్మాతల నిర్ణయంతో టెన్షన్ లో ప్రభాస్ అభిమానులు !
అయితే ఈ సంస్థ లేటెస్ట్ గా నిర్మించిన ‘సలార్’ విషయంలో వారి అలవాటును మార్చుకుని ఆసినిమాను బయ్యర్లకు ఇస్తాము అంటూ బిజినెస్ ఓపెన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనితో ‘సలార్’ విషయంలో ఆమూవీ నిర్మాతలకు సందేహాలు ఉన్నాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ నిర్మాతలు బయ్యర్లకు చెపుతున్న రేట్లు విని చాలామంది బయ్యర్లు షాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ‘ఆదిపురుష్’ ఆమూవీ బయ్యర్లకు ఇచ్చిన అనుభవాలతో ‘సలార్’ విషయంలో అంత మోజుపడే ఆస్కారం కనిపించడంలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నిన్న ఉదయాన్న ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ‘సలార్’ టీజర్ ప్రభాస్ అభిమానులను కూడ పూర్తిగా మెప్పించలేకపోయింది అన్న వార్తలు వస్తున్నాయి.
సుమారు 1.46 నిమషాల సమయం ఉన్న ఈ టీజర్ లో ప్రభాస్ ను పూర్తిగా చూపించక పోవడం అదేవిధంగా అతడితో ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడ లేకుండా చూపించడం అభిమానులను బాగా నిరాశకు గురి అయినట్లు తెలుస్తోంది. ఒక్క ఊచకోత సీన్స్ తప్ప మరేమీ ఈ టీజర్ లో కనిపించక పోవడం కనిపించిన సీన్స్ అన్నీ ‘కేజీ ఎఫ్ 2’ ఛాయలతో ఉండటం అభిమానులను కలవర పెడుతోంది. అయితే అభిమానులను మాత్రం తమ నిరాశను బయటపడకుండా ఈ టీజర్ ను నిన్న అంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మార్చడంతో ఈమూవీకి కూడ భారీ ఓపెనింగ్స్ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..