తెలంగాణ దొరల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'రుద్రంగి'. చిన్నతనంలో తాను చూసిన సంఘటనల ఆధారంగా దర్శకుడు అజయ్ సామ్రాట్ ఈ కథని రాసుకున్నాడు.సీనియర్ హీరో జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మణ్ ఇంకా అలాగే ఆశిష్ గాంధీ తదితరులు ప్రధాన పాత్రధారులుగా, రసమయి బాలకిషన్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'రుద్రంగి' ఈ శుక్రవారం (జూలై 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.రుద్రంగి అనే సంస్థానంలో ఉండే దొర నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. అయితే దొరలు అంటే అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు తమ గడీలకు పిలిపించుకుని వారిని ఎంతో బలవంతంగా అనుభవించేవారు. కొత్తగా పెళ్లైనా కూడా అసలు వదిలే వాళ్లు కాదు. ఎదురు తిరిగితే వాళ్ల భర్తలను కూడా చంపేవారు. అలా అప్పట్లో దొరల అరాచకాలకు అడ్డే ఉండేది కాదు.
ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్స్నే టచ్ చేశారు దర్శకుడు. ఇంకా అలాగే రుద్రంగికి కావల్సింది గడీలు కాదు, బడులు అనే సందేశాన్ని కూడా చెప్పాడు. దీనికి తోడు స్టోరీని నడిపించే విధానంలో కొత్తదనం పాటించాడు.భీమ్ రావ్ దేశ్ముఖ్ పాత్రలో జగపతి బాబు చాలా బాగా నటించారు. ఈ పాత్రకి ఆయన్ని తప్ప మరో నటుడిని ఊహించలేం. ఆయన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఇంకా దొరగా రాజసం ఒలికించిన తీరు అద్బుతం. విమలా రామన్ తన పాత్రలో మంచి నటనని కనబర్చింది. మమతా మోహన్ దాస్ జ్వాలా భాయ్గా అయితే చెలరేగిపోయింది.ఇంకా ఆశిష్ గాంధీ నటన, యాక్షన్ సీన్లలో బాగా మెప్పించాడు. ఇక గనవిది అనేది ఇంపార్టెంట్ క్యారెక్టర్.రుద్రంగిగా తన నటనతో బాగా అలరించింది. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర బాగానే యాక్ట్ చేశారు.అలాగే సాంకేతిక నిపుణులంతా ఈ సినిమా కోసం చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు.