"మహా వీరుడు" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఆ క్రేజీ హీరో..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను ఏర్పరచుకున్న హీరో లలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఆఖరుగా ప్రిన్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
 


అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఒకే రోజు తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రిన్స్ లాంటి యావరేజ్ మూవీ తర్వాత ఈ నటుడు మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ లో మా వీరన్ అనే పేరుతో విడుదల చేయనుండగా ... తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు ... తమిళ భాషలో విడుదల చేయబోతున్నారు.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 8 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి  కన్వెన్షన్ ఫిలింనగర్ లో నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలతో ఒకరు అయినటువంటి అడవి శేషు ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: