తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో
పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ నటుడు ఉప్పెన అనే
మూవీ తో
హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. కృతి శెట్టి
హీరోయిన్ గా నటించిన ఈ
మూవీ కి బుచ్చిబాబు
సనా దర్శకత్వం వహించగా ... మైత్రి
మూవీ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం అలాగే ఈ
మూవీ లో వైష్ణవ్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించడంతో ఈ నటుడు కి ఈ
సినిమా తర్వాత క్రేజీ సినిమాలో అవకాశాలు వచ్చాయి.
అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు ఉప్పెన
మూవీ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా అనే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లుగా మిగిలాయి. ఇలా ఉప్పెన
మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత నటించిన రెండు
మూవీ లతో కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు "ఆది కేశవ" అనే పవర్ఫుల్
మాస్ యాక్షన్ సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు.
ఈ
మూవీ లో
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...
శ్రీకాంత్ ఎం
రెడ్డి ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
నాగ వంశీ ఎస్ ... సాయి సౌజన్య ఈ
మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ ని ఆగస్టు 18 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ బృందం తాజాగా విడుదల చేసిన
పోస్టర్ లో వైష్ణవ్ ...
శ్రీ లీల ఉన్నారు.