అతిలోక సుందరి
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది
జాన్వి కపూర్.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఐదేళ్ల సినీ కెరియర్ లో వినూత్న సినిమాల్లో భాగముతో
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ఇప్పుడు
టాలీవుడ్ కి సైతం ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది ఈ భామ. తెలుగులో
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ . అయితే తాజాగా
జాన్వి కపూర్ కి సంబంధించిన ఒక వార్త సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అది ఏంటంటే ఈ
బాలీవుడ్ బ్యూటీ
తమిళ ఆరంగిట్రానికి కూడా రెడీ అయింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే
లవ్ టుడే సినిమాలు తో తమిళనాట మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు
యువ నటుడు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. అయితే ప్రస్తుతం ఆయన
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక
సినిమా చేయబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్
రొమాంటిక్ కామెడీ కథ అంశంతో ఒక
సినిమా రాబోతుంది. అయితే మొబైల్
ఫోన్ ఉపయోగించి టైం ట్రావెల్ చేసిన ఒక యువకుడు తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అన్నది ఈ
సినిమా కథ అంశమని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో
హీరోయిన్ పాత్ర కోసం
జాన్వి కపూర్ నీ సంప్రదించారట దర్శక నిర్మాతలు.అయితే ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో కథ విన్న వెంటనే జాన్వికపూర్ ఈ
సినిమా చేయడానికి అంగీకరించింది అని అంటున్నారు. ఇక విక్కి -6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమాని స్వీయ నిర్మాణ సంస్థ
రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ నటుడు కమలహాసన్ నిర్మించబోతున్నారు. దీంతో జాహ్నవి కపూర్
బాలీవుడ్ టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో సైతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది..!!