ఆ పని మాత్రం చేయొద్దు అంటున్న సీనియర్ స్టార్ హీరోయిన్...!!
తాజాగా ఈవిషయంలో యంగ్ హీరోయిన్లకు సలహాలు సూచనలు ఇస్తోంది.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. నేచురల్ బ్యూటీని ఎలా కాపాడుకోవాలి... సర్జరీల జోలికి వెళ్లకుండా.. ఎలా జాగ్రత్త పడాలి లాంటి విషయాలను ఆమె వివరించింది. ప్రస్తుతం హీరోయిన్లు చేయకూడని పనులు చేస్తూన్నారంతూ.. మండిపడింది కాజోల్.. ఇంతకీ ఆమె ఏమన్నదంటే..?బాలీవుడ్ లో ఎన్నో సంచలన విజయాలు అందుకుని.. వెండితెరను ఒక ఊపు ఊపింది కాజోల్, స్టార్ సీనియార్ హీరోల సరసన మెరిసిన ఈ భామ... ఇప్పుడు కూడా నాన్ స్టాప్ గా ఏదో ఒకటి చేస్తూ.. తెరపై కనిపిస్తూనే ఉంది. ఆమె నటించిన ట్రయల్ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజోల్ యంగ్ హీరోయిన్ల గురించి కామెంట్ చేసింది.హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలను దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది కాజోల్. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించాడని, ఆ రూపాన్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమని ఆమె అభిప్రాయపడింది. నేచురల్ అందంతో అందరిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి కాని.. సర్జరీల ద్వారా వచ్చే అందం ఎక్కువ కాలం నిలవదన్నారు.
కాజోల్ మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో నా రూపం, శరీర ఛాయపై ఎన్నో విమర్శలొచ్చాయి. కానీ నేనెప్పుడూ కుంగిపోలేదు. ప్లాస్టిక్ సర్జరీల గురించి ఏ రోజూ ఆలోచించలేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రతి సినిమాకు నటనాపరంగా పరిణితి కనబరిచాను. దాంతో నేను స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సాధించారు. ఎవరో ఏదో అన్నారు అని ఆగిపోతే.. అక్కడే ఉండిపోదును అన్నారు కాజోల్.