బోల్డ్ కామెంట్స్ చేసిన విద్యబాలన్....!!
విద్యాబాలన్… ఈమె ఒప్పుకున్నారంటేనే ఏదో స్పెషాలిటీ ఉండే తీరుతుందని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఆషామాషీ కథలకు ఆమె ఓకే చెప్పరని ఓపెన్ గానే అనేస్తారు. నార్త్ సంగతి ఎలా ఉన్నా, సౌత్‌లో మాత్రం ఆచితూచి లు చేస్తుంటారు విద్యాబాలన్. కహానీ తో మొదలు పెట్టి వరుసగా బేగం జాన్, నట్‌ఖట్, శకుంతలా దేవి, షేర్నీ లతో లేడీ ఓరియంటెడ్ లకు కేరాఫ్‌గా మారారు విద్యా బాలన్. లేటెస్ట్ డిజిటల్ మూవీస్ కూడా విద్యా కెరీర్ లో మైల్‌స్టోన్స్ గా నిలిచింది. ఇలా వరుస గా ఎక్స్‌పరిమెంటల్ క్యారెక్టర్స్ చేస్తున్నా… తన లో గ్లామర్ ఫీల్డ్ కు కావాల్సిన హాట్ నెస్ కూడా ఉందని సోషల్ మీడియా అప్‌డేట్స్ తో హింట్స్ ఇస్తుంటారు.
తాజాగా విద్యాబాలన్ తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. తన భర్త తో పరిచయం గురించి రివీల్ చేసిన విద్యాబాలన్, తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిద్దార్థ్ రాయ్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విద్యా. అయితే తనను ఫస్ట్ చూసినప్పుడు ప్రేమకన్నా ముందు ఎట్రాక్షన్ ఏర్పడిందని… ఆ తరువాతే తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పారు. ఈ స్టేట్మెంట్ వైరల్ కావటం తో మరోసారి విద్యా పేరు ట్రెండ్ అవుతోంది.