బాలీవుడ్ సీనియర్ స్టార్
హీరో ఆమిర్ ఖాన్ మొదటి
భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న సంగతి మనందరికి తెలిసిందే. ఐతే ఆ సమయం లో తాను మానసికం గా తీవ్రంగా కుంగిపోయినట్లు వాళ్ల కుమార్తె ఐరా ఖాన్ తాజాగా తెలిపింది.ఐతే ఆమె ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన తల్లిదండ్రులు విడాకుల నిర్ణయం తననెంతో ప్రభావితం చేసిందని చెప్పింది.ఐతే ''అమ్మా-నాన్న విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేను విదేశాల్లో ఉన్నాను. విషయం తెలియగానే వెంటనే భారత్కు తిరిగి వచ్చాను. వాళ్లు స్నేహపూర్వకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిసినా.. నాకు మానసికం గా ఎంతో బాధ కలిగింది. నాలుగు రోజులు అన్నం కూడా తినలేదు. రోజులో ఎనిమిది గంటలు ఏడ్చేదాన్ని, 10 గంటలు నిద్రపోయేదాన్ని. ఏడాదిన్నర పాటు అలానే గడిపాను. నేను ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదు. ఈ విషయం చెప్పి వాళ్ల ను కూడా బాధపెట్టడం నాకు ఇష్టం లేదు''.దానికోసం నేను మౌనంగానే ఉంది నా అంతట నేనే బాధపడేదాన్ని కానీ నేను వాళ్ళ కి ఎప్పుడూ చెప్పలేదు.
''మా కుటుంబంలో కొంతమంది మానసిన రుగ్మతలతో బాధపడుతున్నారు. అందుకే నేనూ చిన్న సమస్యను కూడా తట్టుకోలేక డిప్రెషన్ కు వెళ్లాను. గతేడాది జులైలో తీవ్ర మానసిక ఒత్తిడి కి గురయ్యాను. ఆ సమయంలో మందులు తీసుకోవడం మానేశాను. విపరీతం గా బరువు పెరిగాను. కానీ డిప్రెషన్ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నా. దానితో పోరాడడానికి నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగుంది'' అని ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ చెప్పింది. ఇక ఆమిర్ ఖాన్ తన మొదటి
భార్య రీనా దత్తాకు 2002లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2005లో కిరణ్రావును వివాహం చేసుకున్నారు. 15 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోయింది.