టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్లో ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది సమంత. అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కోరుకుంటూ మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వచ్చింది. ఇక వ్యాధి నుండి బయటపడేందుకు సమంత ఒక పెద్ద యుద్ధమే చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వ్యాధితో చాలా కాలం చేసిన పోరాటం తర్వాత సమంత మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చింది.
ఒకవైపు సినిమా షూటింగ్లకు హాజరవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో సైతం తల ఫాలోవర్స్ కి తనకి సంబంధించిన తాజా అప్డేట్లను ఇస్తూ ఉంటుంది సమంత. అయితే తాజాగా సమంత అతను సోషల్ మీడియా ఎకౌంట్లో ఒక స్టోరీని పోస్ట్ చేసింది. దాంతో షేర్ చేసిన స్టోరీ కాస్త ఎప్పుడూ సినీ ఇండస్ట్రీలోని పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోని సమంత మళ్ళీ ప్రేమలో పడిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎప్పటిలాగే సమంత తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అందులో మరణం నుండి
మనల్ని ఏది రక్షించలేకపోతే కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుండి కాపాడాలి అంటూ ఒక వీడియోకి క్యాప్షన్ పెట్టింది సమంత. ఇక ఆ కోట్ ఇప్పుడు ఎందుకు సమంత షేర్ చేసింది అన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆమె మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు చాలామంది. అయితే గత కొంతకాలంగా సమంత మళ్ళీ ప్రేమలో పడిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే సమంత మళ్ళీ ఇలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఆ వార్తలు నిజమేమో అన్న అనుమానాలకు దారితీస్తుంది. దీంతో సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!