పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్.. ఇక పూనకాలే..!

Divya
అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయగా పుష్ప 2 సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం రూ .1000 కోట్ల వసూళ్ల టార్గెట్తో దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు పని చేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి  కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డం లభించడం జరిగింది. ఇదిలా ఉండగా మరొకవైపు పుష్ప 2 పై హైప్ పెంచడానికి భారీ ఎత్తున స్టార్ కాస్టింగ్ తీసుకుంటున్నారు. అంతేకాదు సినిమాపై అంచనాలు పెంచే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో ఇందులో తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళితే.. ఖిలాడి స్టార్ అక్షయ్ కుమార్ పుష్ప 2 లో కనిపించబోతున్నారట. హిందీలో ఈ సినిమాకి మంచి బిజినెస్ జరగడానికి గాను అక్షయ్ కుమార్ వంటి స్టార్ ఉంటే కచ్చితంగా మంచి కలెక్షన్స్  వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దర్శకుడు ఈ తరహాలో ప్లాన్ చేసినట్లు సమాచారం. కలెక్షన్స్ బాగా రావాలి అంటే అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఆయనను ఈ సినిమాలో తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో సమంత ఐటెం సాంగ్ చేయగా ఇప్పుడు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఊర్వశి రౌటెలా నటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా గురించి వారానికి ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది మరి ఇందులో ఏది నిజమో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: