మోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ నటిమని ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తాజాగా నిఖిల్ హీరోగా గర్రి బిహెచ్ దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ "స్పై" మూవీ లో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. కాకపోతే ఈ మూవీ లో ఐశ్వర్య మీనన్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
స్పై మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఇప్పటికే సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
తాజాగా ఐశ్వర్య మీనన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో గోల్డ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన గోల్డ్ కలర్ లో ఉన్న గాజులను వేసుకొని రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.