తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో సంపత్ నంది ఒకరు. ఈయన ఏమైంది ఈవేళ అనే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నిషా అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పెద్దగా ఏలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు రామ్ చరణ్ హీరోగా రూపొందిన రచ్చ సినిమాకు దర్శకత్వం వహించాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు వరుసగా పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ దర్శకుడు సిటీమార్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. గోపీచంద్ హీరో గా నటించిన ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మహిళా కబడ్డీ క్రీడా నేపథ్యంలో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ దర్శకుడి తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ఇప్పటి వరకు వెలువడలేదు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని సుప్రీమ్ హీరో సాయి దరమ్ తేజ్ తో చేయబోతున్నట్లు ఈ మూవీ లో పూజా హెగ్డే ను హీరోయిన్ గ తీసుకునే ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.