మెగాస్టార్ చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనను తిట్టిన వారైనా సరే వారిని ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం చిరంజీవిది. అంతే కాదు ఎప్పుడూ ఆయన వివాదాలు జోలికి కూడా వెళ్లడు. అంత సున్నిత మనస్కుడు చిరంజీవి. రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇమడ లేకపోయాడు అని తిరిగి తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన సినిమాల్లోకి వెళ్లిపోయారు చిరంజీవి. అయితే ఏం మకుటం లేని మహారాజు జీవితంలో అసంతృప్తి ఏదైనా ఉంది అంటే అది తన చిన్న కూతురు శ్రీజ జీవితమే అని చెప్పాలి. అయితే ఆ అమ్మాయి చదువుకునే రోజుల్లో శిరీష భరద్వాజ్ అని యువకుడిని ప్రేమించింది
హైదరాబాద్ ఆర్య సమాజ్లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాని వెంటనే ఢిల్లీ పారిపోయారు. ఆ సమయంలో చిరంజీవి చాలా కుమిలిపోయారు తనకు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇతర కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని శ్రీజ ఆరోపించడం చిరంజీవి కుటుంబ సభ్యులను ఎంతో కృంగదీసింది. దాని తర్వాత కొన్నిళ్లకు శ్రీజ శిరీష్ మధ్య విభేదాలు రావడం మొదలయ్యాయి. భర్తతో విభేదాలు రాగానే తండ్రి చిరంజీవికి ఫోన్ చేసి ఏడిచింది శ్రీజ. ఇక ఆస్తి కోసం తనను బాగా ఇబ్బంది పడుతున్నాడని కొడుతున్నాడని ఏడుస్తూ చిరంజీవికి చెప్పిందట. దాంతో చిరంజీవి ఎన్నో నిద్రలేని రాత్రులు గరిపారట. చివరికి ఆ దంపతుల మధ్య విభేదాలు రావడంతో తండ్రి వద్దకు వచ్చేసింది శ్రీజ.
తన వద్దకు వచ్చిన ఆమె చిరంజీవి ఎంతో ఆప్యాయంగా చేరదీశారు. అందరిలోనూ శ్రీజ చిన్నది కావడంతో ఆమె అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఇక ఆయనతో విడాకులు తీసుకున్న తరువాత శ్రీజ జీవితాన్ని చక్కదిద్దాడు చిరంజీవి .అనంతరం కళ్యాణ్ అనే యువకుడికి ఇచ్చి ఆమెకి రెండో వివాహం ఎంత అంగరంగ వైభవంగా చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య కూడా విభేదాలు వచ్చాయట. ఇలా గారాబంగా పెంచుకున్న కుమార్తె జీవితం ఇలా అవుతుందని ఊహించలేదు చిరంజీవి. అయితే ఆమె కోసం చిరంజీవి సంపాదనలో నుంచి కొంత మొత్తం చొప్పున ఆస్తులు రాస్తున్నాడు అన్న వార్తలు ఇప్పుడు వినపడుతున్నాయి . అయితే ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో 35 కోట్ల విలువైన ఒక ఇంటిని చిరంజీవి ఆమెకు ఇచ్చేశారట..!!