ఆ షో నుండి తీసేస్తామని ముందే చెప్పారు అని అంటున్న రష్మీ ...!!
వాస్తవానికి అప్పటి వరకు ‘జబర్దస్త్’ యాంకర్ గా కొనసాగిన అనసూయ ఈ షో నుంచి వెళ్లిపోయింది. వెంటనే కొత్త యాంకర్ ను తీసుకురావాలని షో నిర్వాహకులు భావించారు. కానీ, అప్పటికప్పడు కొత్త యాంకర్ ను సెట్ చేయడం అంటే కుదరని పని అని భావించారు. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ యాంకర్ గా ఉన్న రష్మీని ఈ షోకు కూడా యాంకర్ గా చేసేశారు. రెండు షోకు యాంకర్ గా చేసి మంచి పేమెంట్ తీసుకుంది. కొద్ది రోజుల పాటు రెండు షోలకు రష్మి యాంకర్ గా కొనసాగాక, కన్నడ బ్యూటీ సౌమ్యరావును ‘జబర్దస్త్’ యాంకర్ గా తీసుకొచ్చారు. సౌమ్య రావడంతో రష్మీ మళ్లీ ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కు పరిమితం అయ్యింది.సౌమ్యరావు రాకపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు!
రీసెంట్ గా నెటిజన్లతో ఇంటరాక్ట్ అయిన రష్మీ పలు విషయాల గురించి మాట్లాడింది. అదే సమయంలో ఓ నెటిజన్ ‘జబర్దస్త్’ యాంకర్ గా మిమ్మల్ని తీసేసి సౌమ్యరావును తీసుకురావడంపై మీ స్పందన ఏంటి? అని ప్రశ్నించాడు. దీనికి రష్మి స్పందించింది. షో నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. “నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ‘జబర్దస్త్’ యాంకర్ గా ఉండేది కొన్ని వారాలే అని ముందే చెప్పారు. కొత్త యాంకర్ వచ్చాక వెళ్లిపోవాలని అప్పుడే అన్నారు. సో, ఈ షో నుంచి వెళ్లిపోతానని నాకు ముందే తెలుసు. అలాంటప్పుడు నాకు ఎందుకు అభ్యంతరాలు ఉంటాయి?” అని వెల్లడించింది.
అటు నెటిజన్లు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. మూగ జీవాలకు ఇబ్బంది కలిగితే తాను తట్టుకోలేనని వెల్లడించింది. డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా అవి ఎలా ఇబ్బంది పడినా తనకు బాధ కలుగుతుందన్నారు. ఇక 2020 తర్వాత సినిమాల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడిందని చెప్పింది. అయినా, ట్రయల్స్ కొనసాగుతున్నట్లు వివరించింది. సినిమాలు అని కాదు, డిజిటల్ కంటెంట్ కోసం పని చేస్తున్నట్లు వివరించింది. ఇక తనకు తానే ప్రేరణ అని చెప్పుకొచ్చింది రష్మి.