బజ్: మొదలెట్టేసిన డబుల్ ఇస్మార్ట్ మూవీ..!!
ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్ పతాకం పైన పూరి జగన్నాథ్ చారిని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.హీరో రామ్ పై చిత్రీకరణ ముహూర్తం సన్నివేశాలు చార్మి క్లాప్స్ కొట్టి తీసినట్టుగా తెలుస్తోంది. తొలి సన్నివేశానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ అలియాస్ అంటూ కూడా రామ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈనెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ఇస్మార్ట్ శంకర్-2 చిత్రం రష్యన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది హీరోయిన్గా మీనాక్షి చౌదరి, శ్రద్ధా కపూర్ లను ఇందులో హీరోయిన్స్ గా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు సైతం ప్రకటించారు ఈ చిత్రానికి సీఈవో విష్ణు రెడ్డి రచన దర్శకత్వం పూరి జగన్నాథ్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ మూట కట్టుకున్న పూరి జగన్నాథ్ మరి ఈ సినిమాతోనైనా తన పంథా నిరూపిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా రామ్ పోతినేని అభిమానులు మాత్రం ఈసారి కూడా బ్లాక్ బాస్టర్ పక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.