గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే.. ఈసారి ఏకంగా..!!
సెకండ్ హీరోయిన్ కోసం శ్రీ లీల ని తీసుకోవడం జరిగింది. అయితే కాస్త షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ సినిమాలో పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇందుకు కారణం సంయుక్త మీనన్ అన్నట్టుగా వార్తలు వినిపించాయి. పూజా హెగ్డే మీద మోజు పోయిందని అందుకే త్రివిక్రమ్ ఆమెను వదిలేసారంటూ కూడా పలువురు నెట్టిజనులు సైతం సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు మళ్లీ తాజాగా పూజా హెగ్డే త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో తీసుకు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈసారి పూజా హెగ్డేను గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్లు సైతం పూజా హెగ్డే మీద ఇంకా త్రివిక్రమ్ కు మోజు తీరలేదా అంటూ కామెంట్లు చేయడం జరుగుతోంది.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో మొదట యాడ్ కూడా పూజ హెగ్డే నే రావడంతో అప్పుడు కూడా త్రివిక్రమ్ పైన పలు రకాల రూమర్లు వినిపించాయి. ఏది ఏమైనా పూజా హెగ్డే గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఉండబోతుందని తెలిసి పూజా హెగ్డే అభిమానులు కాస్త ఆనందిస్తున్నారు.