జూనియర్
ఎన్టీఆర్ మరియు
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా
సినిమా దేవర. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా
అక్టోబర్ లేదా
నవంబర్ వరకు ఈ
సినిమా షూటింగ్ను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే దేవర సినిమాషూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే
ఎన్టీఆర్ హిందీలో
వార్ 2
సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హ్రితిక్ వర్సెస్
ఎన్టీఆర్ అనే రేంజ్ లో ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అయితే ఈ
సినిమా కంప్లీట్ అయిన వెంటనే
ఎన్టీఆర్ మరియు
ప్రశాంత్ నీల్ తో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు
జూనియర్ ఎన్టీఆర్.
అయితే
ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ
సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు సైతం ఈ
మాస్ కాంబినేషన్ ఎప్పుడూ ప్రారంభం గానుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ మరింత పెరుగుతుందేమో అన్న భయం ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అయితే ప్రస్తుతం
ప్రశాంత్ సలార్
సినిమా పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 28 నా ఈ
సినిమా విడుదల అయిన వెంటనే
ఎన్టీఆర్ 31 సినిమాపై ఫోకస్ పెట్టాల్సి ఉంది ప్రశాంత్మ్.
కానీ సలర్ రెండు భాగాలుగా ఉందని ఆయన ప్రకటించాడు. దాంతో
ఎన్టీఆర్ 31
సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదన్న వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే
ఎన్టీఆర్ 31 డిలే అవుతుందేమో అన్న ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే సలార్ పార్ట్ వన్ రిలీజ్ అయిన వెంటనే రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు రెండు పార్ట్స్ ని కలిపి షూట్ చేస్తున్నారట. చిన్న చిన్న కలెక్షన్స్ లేదా ప్యాచ్ వర్క్ ఉంటే వాటిని కూడా త్వరగా పూర్తిచేసి
ఎన్టీఆర్ 31 సినిమాని స్టార్ట్ చేస్తారట
ప్రశాంత్ నీల్..!!