రెండో పెళ్లికి రెడీ అయిన ఐశ్వర్య రజినీకాంత్..!?

Anilkumar
తమిళ స్టార్ హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజినీకాంత్ దంపతులు విడిపోతున్నట్లుగా గత ఏడాది ప్రకటించారు. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా తమ తమ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు ఈ జంట. అయితే మళ్లీ కొద్ది రోజుల కిందట విడాకులు రద్దు చేసుకుంటారేమో అన్న వార్తలు సైతం వచ్చాయి. కానీ ఆ వార్తలు పై ధనుష్కాని ఐశ్వర్య కానీ స్పందించలేదు. దీంతో వీరిద్దరూ మల్లి కలవడం అసాధ్యం అన్న వార్తలు సైతం వినిపించాయి. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. 

అయితే ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా ఉంటుంది. దానితోపాటు ఒక సినిమాకి డైరెక్షన్ సైతం చేస్తుంది. అయితే ఇలాంటి పుకార్లు రావడానికి ముఖ్య కారణం ఐశ్వర్య పై ఈ మధ్య కూలి వుడ్ కు చెందిన ఒక హీరోతో ఆమె కనిపించడమే అని అంటున్నారు. అయితే చెన్నైలోనే ఒక రిసార్ట్లో ఆమె అతనితో చాలా సన్నిహితంగా ఉంటూ కనిపించడంతో ఐశ్వర్య పై రెండవ పెళ్లి పుకార్లు రావడం మొదలయ్యాయి. అయితే ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియదు. కానీ ఈ విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. లేకపోతే ఇలాంటి పుకార్ల వల్ల ఆమె ఇమేజ్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది.

అయితే  ధనుష్ ఐశ్వర్య  విడిపోవడానికి విడిపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. తామిద్దరం విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించింది. దాని తర్వాత ధనుష్ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా వారి ఫాన్స్ షాక్ అయ్యారు. అయితే సుచిలీక్స్ లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుండే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అన్న పుకార్లు వచ్చాయి. దాని తర్వాత ధనుష్ ఒక స్టార్ హీరోయిన్ తో చాలా చనువుగా ఉండడం ఐశ్వర్య కి నచ్చకపోవడం వల్లే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: