నాని 30 మూవీకి చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే గత ఐదేళ్ల నుండి నాని చేస్తున్న సినిమాలని గమనిస్తే ఆ సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్దగా విజయాలను అందుకో లేకపోయినప్పటికీ కథల ఎంపికలు మాత్రం నాని సక్సెస్ అయ్యాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఏడాది దసరా సినిమాతో ఊహించని కంబాకు ఇచ్చాడు నాని. తాజాగా ఇప్పుడు అదే జోష్తో ఒక క్లాస్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ నాని 30 సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు గ్లిమ్స్ వంటివి మంచి క్రేజ్ ను అందుకున్నాయి. అయితే ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో కొనసాగుతుందని అర్థమవుతుంది. ఇకపోతే ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికి టైటిల్ సైతం ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు హలో డాడీ అనే టైటిల్ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో చిరంజీవి డాడీ అని సినిమా కూడా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తోనే వచ్చింది.. ఇక ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ కు తగ్గట్లు హలో డాడీ అనే

టైటిల్ తో మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. హాయ్ డాడీ హలో నాన్న వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ హలో డాడీ పేరుని దాదాపుగా కన్ఫామ్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నాలుగేళ్ల క్రితం విక్రమ్ కుమార్ తో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా చిరంజీవికి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఎమోషనల్ జర్నీగా సాగే నాని 30 సినిమాలో నానికి జోడిగా సీతారామం బ్యూటీ మ్రోణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో నాని కూతురి పాత్రలో కి ఆరా కన్నా అనే ఒక చిన్నారి కనిపించబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో వీరిద్దరి సన్నివేశాలు గుండెకు హత్తుకుని సీన్లు ఉంటాయని చాలా ఎమోషనల్ గా మనకి కనెక్ట్ అవుతాయి అన్న టాక్  నడుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: