రాజమౌళి యాక్షన్ ప్లాన్ తో గుంటూర్ కారం కు టెన్షన్ !

Seetha Sailaja
మహేష్ రాజమౌళి ల సినిమాకు సంబంధించిన కథ ఒక కొలుక్కు రావడంతో ఈమూవీ నిర్మాణానికి సంబంధించిన పనుల పై రాజమౌళి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో నిర్మాణం జరుపుకునే ఈ మూవీలో మహేష్ పాత్రను పరోక్షంగా ప్రభావితం చేసే శక్తిగా అంతర్లీనంగా ఆంజనీయ స్వామి కూడ ఈమూవీలో ఉండబోతున్నాడని టాక్.



‘బాహుబలి’ లో ప్రభాస్ ను శివుడు గా చూపెడితే ఈమూవీలో మహేష్ బాబును ఆంజనీయ స్వామి అంశ తో ఉండే వ్యక్తిగా రాజమౌళి ఆపాత్రను డిజైన్ చేశాడని అంటున్నాడు. ఈమూవీలో అనేకమంది బాలీవుడ్ నటులతో పాటు ఒక ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ గా నటిస్తుంది అన్న లీకులు వస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన కథ ఫైనల్ అవ్వడంతో రాజమౌళి ఈసినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక పూర్తి చేసి వారికి ఒక వర్క్ షాపు నిర్వహించాలని జక్కన్న ఆలోచన అని అంటున్నారు.



ఈ వర్క్ షాప్ మనదేశంలో కాకుండా విదేశాలలో నిర్వహిస్తారని తెలుస్తోంది. మూడు నెలల పాటు కొనసాగే ఈ వర్క్ షాప్ నవంబర్ డిసెంబర్ జనవరిలో ఉండే విధంగా జక్కన్న ఆలోచన అని అంటున్నారు. ఒకసారి వర్క్ షాప్ ప్రారంభం అయింది అంటే రాజమౌళి సినిమాల్లో నటించే నటీనటులు విద్యార్ధులు లా మారిపోవలసిందే. మరొక విషయం పై ఆలోచన చేయడానికి జక్కన్న అంగీకరించడు.



దీనితో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘గుంటూరు కారం’ మూవీని ఎట్టి పరిస్థితులలోను నవంబర్ లోపు త్రివిక్రమ్ పూర్తి చేసి తీరాలి. అయితే ఈమూవీ షూటింగ్ ఇంకా చాల పెండింగ్ ఉన్న నేపధ్యంలో త్రివిక్రమ్ అదేవిధంగా మహేష్ పరుగులు తీయవలసి ఉంటుంది. ఒకసారి రాజమౌళి తన వర్క్ షెడ్యూల్ అనుకున్న తరువాత ఏమాత్రం అలసత్వం వహించడు. ఈపరిస్థితుల మధ్య ‘గుంటూరు కారం’ యూనిట్ తీసే పరుగులలో పొరపాట్లు జరగకుండా ఫలితం రాబట్టాలి అంటే త్రివిక్రమ్ చాల ప్లాన్డ్ గా వ్యవహరించవలసి వస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: