ఆగిపోయిన ప్రభాస్,మారుతి సినిమా.. అదే కారణమా..!?

Anilkumar
స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో చివరిగా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నడు. దాని తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ కూడా యావరేజ్ గానే మిగిలిపోయాయి. అయితే ఇటీవల ఆయన నటించిన ఆది పురుష సినిమా సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది ఈ సినిమా. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ఇలాంటి సినిమాలు తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ సినిమా ఏదైనా ఉంది అంటే అది సలార్. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కావడానికి రెడీగా ఉంది. 


ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగా కట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో ప్రాజెక్ట్ స్పిరిట్ డైరెక్టర్ మారుతితో రాజా డీలక్స్ వంటి సినిమాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మారుతి సినిమా క్యాన్సిల్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డైరెక్టర్ మారుతి వంటి దర్శకులతో ప్రయోగం చేయాలని అంటూ ప్రభాస్ ఈ సినిమా చేయొద్దన్న నిర్ణయం తీసుకున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా షూటింగ్ పక్కన పెట్టేసి వేరే సినిమాలో షూటింగ్లో పాల్గొంటున్నాడట ప్రభాస్.


అయితే ఒకవేళ ప్రాజెక్ట్ కి సినిమాలో హిట్ అయితే తప్పకుండా డైరెక్టర్ మాయతీతో సినిమా మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాడట ప్రభాస్. ఐతే మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ సినిమాలో లేనట్లే అంటూ వార్తలు వినబడుతున్నాయి. అయితే కొంతమేరకు ఈ సినిమా షూటింగ్ జరిగిందని అంటున్నారు. కనుక వాయిదా వేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటూ నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారట. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారన్న వార్తలు సైతం వచ్చాయి. భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సినిమా ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: