పాన్
ఇండియా స్టార్
హీరో యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె
సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ
సినిమా గురించి రోజు రోజుకు కూడా ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి.ఇక ఈ
సినిమా మొత్తం రెండు పార్టులుగా వస్తుందని.. కాదు కాదు.. ఫ్రాంచైజీ గా వుంటుందని… ఇలా రకరకాలుగా చాలా వార్తలు వస్తున్నాయి. కానీ తెలిసిన సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కేను కాదు ఫ్రాంచైజీ కాదు రెండు భాగాలుగానే చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట.అసలు ఈ
మూవీ మొదలు పెట్టక ముందు అనుకున్న బడ్జెట్ వేరు.. ఇప్పుడు మొదలు పెట్టాక తేలుతోన్న లెక్కలు వేరు.సినిమాకి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్లాన్‌లు మార్చుకోక తప్పడం లేదంటున్నారు. ఇందుకోసమే పాన్
ఇండియా లెవల్లో మరింత క్రేజ్ వచ్చేందుకు అన్ని భాషల నటులను కూడా ఈ సినిమాలో యాడ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఇక రెండు పార్టులలో పార్ట్ 1అయితే కేవలం పాత్రల పరిచయంతో అసలు కథలోకి వెళ్లడం ఉంటుందని సమాచారం తెలుస్తుంది. అలాగే రెండో పార్టులో సినిమాకు లీడ్‌గా పార్ట్ 1 ఎండింగ్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్
సినిమా చివరి అరగంటలో ఎంట్రీ ఇస్తాడని… కమల్ ఎంట్రీతో రెండో పార్ట్ అంతా కూడా కమల్ మీదే ఉంటుందన్న ఫీలింగ్‌తో సినిమాను ప్లాన్ చేశారట. మొత్తానికి బాహుబలి,
kgf సిరీస్ లా తీయడానికి ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారట.ఇక ముందుగా ఈ సినిమాకు మొత్తం 500 కోట్ల బడ్జెట్ అవుతుందనుకున్నారు. అయితే ఇప్పుడు అది కాస్తా ఏకంగా 800 కోట్లు అయ్యిందట. అందువల్ల రెండు పార్టులుగా సినిమాను రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమాని
హాలీవుడ్ రేంజ్ లో
నాగ్ అశ్విన్ డిజైన్ చేస్తున్నాడట. అందుకోసం కొన్ని
హాలీవుడ్ స్టూడియోలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.ఖచ్చితంగా ఈ
సినిమా అవతార్, అవేంజర్స్ తరహాలో జనాలకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందట.మరి చూడాలి ఈ
సినిమా ఎలాంటి రికార్డులని నమోదు చేస్తుందో..