తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లు అర్జున్ కొంత కాలం క్రితం అలా వైకుంటపురంలో అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో తమన్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.
ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తోంది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ఏకంగా 29.4 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకొని బుల్లి తెర ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా 8 సార్లు బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. ఈ 8 సార్లు కూడా ఈ మూవీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతూనే ఉంది.
ఇకపోతే తాజాగా ఈ మూవీ 8 వ సారి బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. 8 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.39 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. ఇలా 8 వ సారి కూడా ఈ మూవీ కి ఈ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ దక్కడం అనేది మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.