అమ్మాయిలతో మాట్లాడానికే.. నాకు రెండేళ్లు పట్టింది : ఆనంద్ దేవరకొండ

praveen
ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు విజయ్ దేవరకొండ. తన నటనతో తన యాటిట్యూడ్ తో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక విజయ్ దేవరకొండ యాటిట్యూట్ చూసి కోట్ల మంది అభిమానులు అతని మాయలో పడిపోయారు. విజయ్ దేవరకొండ లాంటి భర్త వస్తే ఎంత బాగుండు అని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ హీరోయిన్స్ సైతం విజయ్ దేవరకొండ పేరు చెబితే పడి చచ్చిపోతూ ఉంటారు.


 ఇక విజయ్ దేవరకొండ ఇలా అమ్మాయిలో.. ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాదు.. ఇక సినిమాల్లోనూ.. అమ్మాయిలతో డీప్ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. మాత్రం ఒకానొక సమయంలో తనకు అమ్మాయిలతో మాట్లాడడానికే.. రెండేళ్లు పట్టింది అంటూ చెబుతున్నాడు. ఇటీవల బేబీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు ఆనంద దేవరకొండ. ఇక ఈ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఇంటర్వ్యూలో భాగంగా తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఎవరి జీవితంలో అయినా తొలిప్రేమ ఎప్పటికీ.. ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతూ ఉంటుంది. తొలిప్రేమ సక్సెస్ అయినా లేకపోతే ఫెయిల్ అయినప్పుడు గుర్తింపు ఉంటుంది. నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో చదివాను. కానీ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలతో మాట్లాడడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది. ఇక తాను నటించిన బేబీ సినిమా ప్రేమిస్తే, 7 జి బృందావన కాలనీ స్థాయిలో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటికే ఏమో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ దేవరకొండ..మొదటిసారిలవ్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: