ఆర్థిక ఇబ్బందులలో హీరోయిన్ దీపికా పదుకొనే.. కారణం..?
సినీరంగంలో ప్రతి రోజు అభివృద్ధితో దూసుకుపోతున్న హీరోయిన్గా పేరుపొందిన దీపికా పదుకొనే తాను ప్రారంభించిన ఒక వ్యాపారంలో తీవ్రమైన నష్టాలను చవిచూసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తను మొదలు పెట్టిన స్కిన్ కేర్ బ్రాండ్ కి సంబంధించిన ఒక స్టార్ప్ ను దీపిక ప్రారంభించడం జరిగింది. దీపిక కంపెనీలో ఎంతోమంది పెట్టుబడులు పెట్టడం జరిగింది.దాదాపుగా 10 సంవత్సరాలుగా దీపిక పదుకొనే ఈ కంపెనీని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మెల్లమెల్లగా సక్సెస్ అవుతున్న సమయంలో ఇందులోని ఒక కీలకమైన భాగస్వామి ఆర్థిక నష్టాల వల్ల ఇందులో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో దీపిక స్కిన్ కేర్ ప్రొడక్షన్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి దీంతో గత కొంత సంవత్సరం నుంచి తన సంస్థలో ఉండేటువంటి కార్యకలాపాలను పలుచోట్ల నిలిపివేయడంతో పాటు ఇందులో పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీంతో దీపిక స్కిన్ కేర్ కంపెనీ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో ఉంటుందా ఉండదా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉన్న దీపికా పదుకొనే ఇలా బిజినెస్ పరంగా హార్దిక ఇబ్బందులు ఎదురవుతోందని తెలిసి అభిమానులు సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఇవి నిజమో కాదో తెలియాల్సి ఉంది.