కమెడియన్ సత్య.. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా?

praveen
సాధారణంగా సినిమా విజయం సాధించాలి అంటే హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసి కడుపుబ్బ నవ్వించే కమేడియన్స్ కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు అటు కథ బాగా లేకపోయినప్పటికీ కామెడీ ట్రాక్ వర్క్ అయ్యి సూపర్ హిట్ సాధించిన సినిమాలు కూడా టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అయితే ఒకప్పుడు బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్ అంటూ కొంతమంది కమేడియన్స్ పేర్లు వినిపించేవి. కానీ ఇటీవల కాలం వెన్నెల కిషోర్, సత్య, రంగస్థలం మహేష్ అంటూ కొన్ని పేర్లు మాత్రమే వినిపిస్తూనే అని చెప్పాలి.


 ముఖ్యంగా నేటి తరం కమెడియన్స్ లో సత్యా తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. పిల్ల జమిందార్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య.. ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా మారిపోయాడు. నాగశౌర్య నటించిన రంగ బలి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి కడుపుబ్బా నవ్వించాడు ఈ కమెడియన్.


 అయితే ఇలా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా కొనసాగుతున్న సత్య ఇక ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే సత్య ఇండస్ట్రీకి రాకముందు హైదరాబాద్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడిపే వాడట. ఇక ఒకవైపు అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టేవాడట. ఇక ఈయనకు కమెడియన్ ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమం లో అవకాశం కల్పించారు. అప్పటికే ధనరాజ్ సినిమా అవకాశాలను అందుకుంటూ జబర్దస్త్ లో గుర్తింపు పొందారు. దీంతో సత్యను జబర్దస్త్ కార్యక్రమం లోకి కూడా ఆహ్వానించాడు ధనరాజ్. అయితే జబర్దస్త్ లో కొంతకాలం సందడి చేసిన సత్యా ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకుని ఇక ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: