బేబీ కథ విన్నప్పుడు.. నా జీవితమే గుర్తొచ్చింది : వైష్ణవి చైతన్య
ఎన్నో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీగానే అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మాయి.. ఇక ఇప్పుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాతో వెండితెరపై హీరోయిన్గా పరిచయం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే భారీగా ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవి చైతన్య బేబీ సినిమా కథ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కొన్ని విషయాలు విన్నప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాదు.. బేబీ సినిమా కథ విన్నప్పుడు కూడా నా పరిస్థితి అలాగే ఉంది. నేను యూట్యూబర్ గా అందరికీ తెలుసు. కథానాయక కావాలని లక్ష్యంతో పరిశ్రమకు వచ్చాను. ఎనిమిదేళ్లపాటు ఎన్నో ఆఫీసులో చుట్టూ తిరిగాను కానీ ఛాన్స్ రాలేదు. దీంతో యూట్యూబ్గానే ఉండిపోతానేమో అనే భయం వేసేది కానీ అంతలోనే బేబీ కథ నా దగ్గరికి వచ్చింది. ఈ కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో బస్తీలో పుట్టి పెరిగే అమ్మాయి పాత్రలో కనిపిస్తా నేను నిజంగానే బస్తీ అమ్మాయినే. మేము ఉండేది చంద్రయాన్ గుట్టలో అందుకే ఈ కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తొచ్చింది అంటూ వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది.