బన్నీని ఆ గెటప్ లో అసలు చూడలేకపోయాను అంటున్న హాట్ బ్యూటీ....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో యాంకర్ అనసూయ పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. కొన్నిసార్లు అనసూయ అభిమానం తో చేసిన కామెంట్లు సైతం వివాదంగా మారి ఆమెను ఇబ్బంది పెడుతుంటాయి.విజయ్ దేవరకొండ తో వివాదం ద్వారా తరచూ వార్తల్లో నిలిచిన అనసూయ ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. పుష్ప2 సినిమా లో దాక్షాయణి రోల్ లో ఆమె కనిపించనున్నారు.అయితే గతం లో ఒక సందర్భం లో అనసూయ చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకు సంబంధించి అనసూయ వివరణ ఇచ్చినా ఇప్పుడు వివరణ కంటే బన్నీపై ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బన్నీని తాను ఎంతగానో అభిమానిస్తానని ఆమె అన్నారు. ఐ లవ్ బన్నీ అని అమె కామెంట్లు చేశారు.
అయితే గంగోత్రి సినిమా విడుదలైన సమయం లో మాత్రం బన్నీని చూసి ఓరి దేవుడో అనుకున్నానని మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా? అని అనిపించిందని మీరందరూ కూడా అదే అనుకుంటూ ఉంటారని ఆమె వెల్లడించారు. లేడీ గెటప్ లో బన్నీని అస్సలు చూడలేకపోయానని అనసూయ కామెంట్లు చేశారు. ఆర్య సినిమా నుంచి మాత్రం బన్నీ తనను తాను మార్చుకున్న విధానం మాత్రం అదీ కమిట్ మెంట్ అని అనిపించిందని అనసూయ వెల్లడించారు.బన్నీ వరకు కూడా ఇవి అన్నీ వెళ్లి ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్ల లో బన్నీ గురించి నెగిటివ్ గా చెప్పిన కామెంట్లు మాత్రమే ప్రచారం లోకి వెళ్లడంతో అనసూయ స్పందిస్తూ బన్నీ గురించి నేను గొప్పగానే చెప్పానని కెరీర్ తొలినాళ్లలో కలిగిన అభిప్రాయాన్ని ఆ తర్వాత ఎదిగిన తీరును మాత్రమే చెప్పానని అనసూయ తెలిపారు. పుష్ప2 సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో అనసూయ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: