తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను ... సూపర్ సక్సెస్ ను అందుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ను తెచ్చుకుంది. దానితో ఈ నటికి వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కాయి.
అందులో భాగంగా ఉప్పెన మూవీ తర్వాత ఈ నటి నటించిన శ్యామ్ సింగరాయ్ ... బంగార్రాజు మూవీ లు మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ నటి నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఆఖరిగా ఈ నటి కస్టడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ప్రస్తుతం కృతి ... శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా కూడా కృతి తనకు సంబంధించిన కొన్ని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో స్కై బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కృతి కి సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.