ఆ తెలుగు మూవీకి సంగీతం అందించబోతున్నాను... రెహమాన్..!

Pulgam Srinivas
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఏఆర్ రెహమాన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్రను పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే రెహమాన్ ఆస్కార్ అవార్డును కూడా అందుకొని ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ సంగీత దర్శకుడు తన కెరియర్ లో చాలా తక్కువ తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఇకపోతే తాజాగా రెహమాన్ ఒక తెలుగు సినిమాకు సంగీతం అందించబోతున్నాను అని అధికారికంగా ప్రకటించాడు. ఆ తెలుగు సినిమా ఏది ... ఆ వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొన్ని రోజుల్లో బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడి చాలా రోజులే అవుతుంది. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించి రెహమాన్ కొన్ని ఆసక్తికరమైన విషాలను చెప్పుకొచ్చాడు. నేను రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంగీతం అందించబోతున్నాను ... ఆ సినిమాకు సంగీతం అందించడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అని రెహమాన్ చెప్పుకొచ్చాడు. ఇలా తాజాగా ఏ ఆర్ రెహమాన్ ... రామ్ చరణ్ కెరీర్ లో 16 వ మూవీ కి సంగీతం అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: