హీట్ ఎక్కిస్తున్న సలార్ జవాన్ రగడ !

Seetha Sailaja
సెప్టెంబర్ లో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి ‘సలార్’ అయితే మరొకటి ‘జవాన్’. ఈరెండు సినిమాల పై విపరీతమైన బిజినెస్ కూడ జరిగింది. ‘పఠాన్’ మూవీ విడుదల తరువాత ఒక్కసారిగా షారూఖ్ ఖాన్ క్రేజ్ మళ్ళీ తారా స్థాయికి చేరుకుంది. దీనితో పేరుకు ఇది బాలీవుడ్ హీరో సినిమా అయినప్పటికీ ఈ మూవీ పై తెలుగు రాష్ట్రాలలోని సినిమా అభిమానులకు కూడ బాగా ఆశక్తి పెరిగింది.

దీనికితోడు ఈసినిమాకు దక్షిణాది సినిమా రంగంలో ఎంతో పేరున్న అట్లీ దర్శకత్వం వహించడంతో పాటు ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండటంతో ఈసినిమాను దక్షిణాది సినిమాగానే భావిస్తున్నారు. ఇక ప్రభాస్ ‘సలార్’ పై ఆకాశాన్ని అంటే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈసినిమాకు ‘కేజీ ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ఈమూవీ పై కూడ అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్లకు విపరీతమైన స్పందన రావడంతో ఈ రెండు రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ రెండు సినిమాలకు బడ్జెట్ విపరీతంగా ఖర్చు పెట్టడంతో ఈరెండు సినిమాల బిజినెస్ కూడ అత్యంత భారీ స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు కలక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అన్న సంకేతాలు రావడంతో షారూఖ్ ఖాన్ అభిమానులు అదేవిధంగా ప్రభాస్ అభిమానులు ఈ రెండు సినిమాల ఫలితం తెలియకుండానే సోషల్ మెడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.


అంతేకాదు షారూఖ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోని ఆకాశంలోకి ఎత్తెస్తూ చేస్తున్న కామెంట్స్ హదావిడికి సరిసమానంగా ప్రభాస్ అభిమానులు కూడ చేస్తున్న కామెంట్స్ హడావిడితో సోషల్ మీడియాలో ‘సలార్’ ‘జవాన్’ రగడ హాట్ న్యూస్ గా మారింది. తమ హీరోల పై ఉన్న విపరీతమైన అభిమానంతో ప్రభాస్ షారూఖ్ అభిమానుల సందడిని టాప్ హీరోల అభిమానులు ఆశక్తిగా గమనిస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: