Baby: సక్సెస్ అయిన ఆనంద్ దేవరకొండ..!!
గతంలో కంటే ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో చాలా విభిన్నంగా సరికొత్తగా కనిపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా తన పాత్రలు ఒదిగిపోయి పోయి మరి నటించిందని సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి కథ, క్యారెక్టర్లు చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పదవ తరగతి నుంచి లవ్ స్టోరీ చూపించడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యారని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యువతీ యువకుల మధ్య ప్రేమ ఈ సినిమాలో చాలా పశిష్టంగా చూపించినట్లు తెలుస్తోంది.
విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో నుంచి వచ్చిన అమ్మాయి పై చదువు పై చదువుల కోసం పట్నానికి వెళ్లగా అక్కడ ఆ అమ్మాయికి జరిగినటువంటి మార్పులు.. అక్కడ దగ్గరైన విరాజ్ అనే అబ్బాయితో రొమాన్స్ పబ్బులకు వెళుతూ ఉంటుంది.. అయితే చివరికి ఈ విషయం తెలిసిన తర్వాత ఆనంద్ ఎలా రియాక్ట్ అవుతారు.. తెలిసిన ఎలా రియాక్ట్ అవుతారు.. చివరిగా వైష్ణవి ఎవరిని ప్రేమించింది ఏం జరిగింది అనే విషయం తెలియాలి అంటే వెండితెర పైన చూడాల్సిందే. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం బేబీ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఈ సినిమా మొదటి భాగం కంటే రెండో భాగం హైలైట్ గా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాతో ఆనంద దేవరకొండ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.