ఆ మూవీ వల్లే.. నేను సినిమాలకు దూరమయ్యాను : హీరోయిన్

praveen
సాధారణం గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. ఇలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఆ తర్వాత కాలం లో సినిమాలకు దూరమైనప్పటికీ కూడా ప్రేక్షకుల మదిలో మాత్రం చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుని కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్ అంకిత.


 తన అందం ఉదయం తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి మూవీలో కూడా నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అంకిత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చింది అని చెప్పాలి. ఇలా వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఇక సినిమాలను దూరం పెట్టేసింది. కథలతో డైరెక్టర్లు ఆమె దగ్గరికి వెళ్లిన నో చెబుతూ వచ్చింది.


 అయితే సడన్గా అంకిత ఎందుకు సినిమాలకు దూరమయ్యారు అన్న విషయం మాత్రం అభిమానులకు అర్థం కాలేదు. మళ్లీ ఆమె సినిమాలు చేస్తారేమో అని ఎంతో ఆశగా ఎదురు చూశారు అభిమానులు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తాను సినిమాలకు దూరం కావడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను హీరోయిన్గా నటించిన విజయేంద్ర ప్రసాద్ సినిమా ఫ్లాప్ కావడంతోనే ఇక సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే సినిమాల్లో కొనసాగే దానిని అంటూ తెలిపింది. ఇక ఇప్పుడుఅవకాశాలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది హీరోయిన్ అంకిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: