మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏ విషయంలోనైనా ఇలాంటి మొహమాటం లేకుండా తన మనసులో అనిపించిన అతని అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తాడు. అయితే ఎలాంటి మొహమాటం లేకుండా తన మనసులోని మాటని బయటపడతాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు అందుకే ఆయన్ని తన అభిమానులు రౌడీ హీరో అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోని తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి కొన్ని సంచులను కామెంట్లను చేయడం జరిగింది. 

దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆయన ఖుషి సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోని ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల చేశారు. మొదట నారోజా నువ్వే అన్న పాటని విడుదల చేయగా ఆ పాట ఊహించిన రెస్పాన్స్ ను కనబరిచింది. తాజాగా ఖుషి సినిమా నుండి ఆరాధ్య అనే పాటను విడుదల చేశారు మేకర్స్.. అయితే ఇందులో పెళ్లి తర్వాత జంట మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు. దర్శకుడు అయితే ఈ పాట గురించి విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది.

ఇకపోతే ఆయన ఖుషి సినిమాలో నాకు ఇష్టమైన పాటై ఇదే అని..  పెళ్లయినా ఏడాదిలోపు భార్యాభర్తలు ఎలా ఉండాలో చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారు. అంతేకాదు వారి మధ్య అనుబంధాన్ని కూడా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ భవిష్యత్తులో నా మ్యారేజ్ లైఫ్ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని అనుకుంటున్నాను.. అంటూ ఈ సందర్భంగా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు విజయ్ దేవరకొండ.ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్ ని చూసిన వారందరూ త్వరగా పెళ్లి చేసుకో విజయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు త్వరగా పెళ్లి చేసుకొని ఈ విషయం చెప్తే బాగుంటుంది అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: