చిన్న డైరెక్టర్ కావడంతో.. బేబీ కథ వినకుండానే రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
కాగా నేడు గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ వచ్చేసింది. దీంతో ఇక ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ ఖాయమని తెలుస్తుంది. ఆనంద్ దేవరకొండ కెరియర్లో ఇక బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుంది ప్రేక్షకులు భావిస్తున్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఒక ఈ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినందుకు వైష్ణవి చైతన్య ఎంత ఎమోషనల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను అనుకోలేదట. మరో హీరోయిన్ తీసుకోవాలని డైరెక్టర్ సాయి రాజేష్ భావించాడట.
అయితే ఈ సినిమా కోసం ఆనంద దేవరకొండ ని హీరోగా ఎంపిక చేయడానికి ముందు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం శ్రీ లీల అయితే బాగుంటుందని దర్శకుడు సాయి రాజేష్ అనుకున్నాడట. శ్రీలీల ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా ఉండడంతో.. ఇక పబ్లిసిటీ కూడా కలిసి వస్తుందని అనుకున్నాడు. ఇక ఈ పాత్రకు ఈ జనరేషన్ అమ్మాయి కావాలి.. అయితే సరిగా సెట్ అవుతుంది అనుకున్నాడట. అయితే కొత్త డైరెక్టర్ అని తెలిసి కథ వినకుండానే ఇక ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట శ్రీ లీల. అయితే తక్కువ బడ్జెట్ కావడంతో.. ఎవరిని హీరోయిన్ గా చూస్ చేసుకుందామా అనుకుంటుండగా.. వైష్ణవి చైతన్య పేరు మధిలో మెదిలిందట. అలా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారు.