అలా జరగడంతో ఎమోషనల్ ఐనా శైలేష్ కొలను...!!
ఈ కుక్క కూడా చాలా హైలైట్ అయింది.అయితే తాజాగా ఆ కుక్క మరణించడంతో డైరెక్టర్ శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే ఒక రోజు ముందు శైలేష్ తన డాగ్ మాక్స్ కి జ్వరం వచ్చిందని తనకోసం అందరూ ప్రార్థించండి అని కోరారు. అయితే ఆ డాగ్ చనిపోయినట్లు ఈయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా శైలజ ఈ విషయాన్నిసోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బాధ తప్ప హృదయంతో ఈ వార్తను నేను మీకు తెలియజేస్తున్నాను.
మాకు ఎంతో ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయాడు. గత పది రోజులుగా తాను టిక్ ఫీవర్ తో బాధపడుతు పోరాటం చేశాడు. నేను నా జీవితంలో కలుసుకున్న సున్నితమైనటువంటి సోల్ మేట్ లో మాక్స్ ఒకరు. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆఫీసర్ మాక్స్ నిన్ను చాలా మిస్ అవుతున్నాను.మీరు లేకుండా హిట్ 2 సినిమాని ఊహించుకోలేము అంటూ ఈయన చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.