తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తమిళనాట స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విజయ్ ఇప్పటికే తాను నటించిన కొన్ని సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ఆకరుగా ఈ నటుడు వారిసు అనే తమిళ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాను వారసుడు అనే పేరుతో తెలుగులో విడుదల చేశారు.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ ఒక పాటను విడుదల చేయగా దానికి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇకపోతే లియో మూవీ తర్వాత విజయ్ తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 68 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ హక్కులను ఇప్పటికే సన్ టీవీ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.