బేబీ మూవీ ని వదులుకున్న స్టార్ హీరోయిన్...!!

murali krishna
బేబీ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్స్ గా నటించిన సినిమా కావడం తో తొలుత ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది.

నిజానికి ఒక చిన్న దర్శకుడు కావడం వల్లనో ఏమో తెలియదు కానీ మొదటి షో పడే వరకు కూడా ఈ చిత్రం ఎలా ఉంటుంది అని ఒక అంచనాకు రాలేదు. కానీ మొదటి షో తరవాత వస్తున్న రివ్యూ లను చూసి టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.ఈ సినిమా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ గా తెరకెక్కి అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇలాంటి అద్భుతమైన ప్రేమ కథ చిత్రంలో హీరోయిన్ గా మొదట శ్రీ లీల అయితే బాగుంటుంది అని దర్శకుడు సాయి రాజేష్ అనుకున్నాడట. శ్రీ లీల ప్రస్తుతం చాల పెద్ద ప్రాజెక్ట్స్ లో పని చేస్తుంది.

దాంతో కథ కూడా వినకుండా ఆమె ఈ చిత్రానికి నో చెప్పిందట. శ్రీ లీల ఈ జెనరేషన్ హీరోయిన్ పైగా ఇలాంటి ఒక క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే మార్కెటింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాడట. కానీ అది కుదరకపోయే సరికి మరియు ఇదొక చిన్న బడ్జెట్ సినిమా కావడం వల్ల కూడా ఒక యూట్యూబర్ అయినా వైష్ణవి చైతన్య ను హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఇక బేబీ సినిమా ఈ రేంజ్ టాక్ తెచ్చుకోవడం తో శ్రీ లీల తన ఖాతా లో మంచి హిట్ సినిమా మిస్ అయ్యింది అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. అయితే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అందరు చాల ఫ్రెష్ గా స్క్రీన్ పై కనిపించారని, అందుకే బేబీ సినిమా హిట్ అయ్యిందని, లేకపోతే సినిమా విజయం సాధించడం కష్టం అయ్యేదని అంటున్నారు. ఇక బేబీ సినిమా కథ విషయానికిఇ వస్తే టీనేజ్ అట్రాక్షన్ మరియు వయసు వచ్చాక ప్రేమకు మధ్య తారతమ్యాలను చాల క్లియర్ గా చూపించాడు దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: