బాలీవుడ్
ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన ప్రొడక్షన్
హౌస్ లలో ఒకటి అయినటువంటి యాష్
రాజ్ ఫిలిమ్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినిమా అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ బ్యానర్ వారు ఎన్నో సినిమాలను నిర్మించి అద్భుతమైన గుర్తింపును
ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా ఈ బ్యానర్ వారు యాష్
రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
అందులో భాగంగా ఇప్పటికే ఈ యూనివర్స్ నుండి ఏక్ థా టైగర్ అనే
సినిమా 2012 లో విడుదల అయింది.
టైగర్ జిందా హై అనే
సినిమా 2017 లో విడుదల అయింది.
వార్ అనే
సినిమా 2019 లో విడుదల అయింది. పఠాన్ అనే
సినిమా 2023 లో విడుదల అయింది. ఈ నాలుగు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని భారీ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. ఇది ఇలా ఉంటే ఈ యూనివర్స్ నుండి మరో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటగా టైగర్ 3 అనే
మూవీ రాబోతుంది. ఈ సినిమాలో
సల్మాన్ ఖాన్ హీరోగా నటించబోతున్నాడు.