రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ వెంకీ రి రిలీజ్..!!
ఇప్పటివరకు స్టార్ హీరోల చిత్రాలు మహేష్ ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ తదితర హీరోల చిత్రాలు పరంగా భారీగానే రాబట్టాయి. ఇప్పుడు రవితేజ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవితేజకు జోడిగా స్నేహ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ట్రెండీగా మారుతూ ఉంటాయి. అయితే ఈ సూపర్ హిట్ సినిమా ఎప్పుడు రీ రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోని తాజాగా వెంకీ సినిమా డిసెంబర్ 30 వర్ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటోంది .ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించడం జరిగింది. వెంకీ సినిమా కూడా ఈ నగరానికి ఏమైంది అని సినిమా ఎంతలా సక్సెస్ అయ్యిందో అలా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.