VD -13: సంక్రాంతి బరిలో దిగబోతున్న విజయ్ దేవరకొండ..రిస్కేనా..?

Divya
హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయినట్లుగా తెలుస్తోంది ఇందులో హీరోయిన్గా సమంత నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడం జరుగుతోంది. ఈ చిత్రం ప్యూర్ లవ్ స్టోరీ తో తెరకెక్కించడం జరుగుతోంది .ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రెండు చిత్రాలను కమిట్ అయ్యారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాని చేయబోతున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు విజయ్ దేవరకొండ. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది.
దీంతోపాటు డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో గీతాగోవిందం-2 విడుదల కాబోతోందని వార్తలు వినిపించాయి. ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్  నటిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా పోస్టర్లో కన్ఫామ్ చేయడం జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టైంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ దిల్ రాజుకు బాగానే కలిసి వచ్చాయి.
అలా ఈసారి విజయ్ దేవరకొండ 13 వ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. పరశురాం విజయ కాంబినేషన్లో గతంలో గీతగోవిందం సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అలాంటి  సినిమానే  ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో ఎన్నో చిత్రాలు ఉన్నప్పటికీ ఇంకా విడుదల తేదీలను సంక్రాంతికి ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో ఏవి ఉంటాయి ఏవి ఉండవనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: