ఆ కారణంగా ఎమోషనల్ కి గురై కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక మందన్న....!!
'బేబీ నాకు చాలా నచ్చింది. నటీనటులు అద్భుతంగా అద్భుతంగా నటించారు. ఈ చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ఈ మూవీలోని సీన్స్ నా మదిలో చాలాకాలం నిలిచిపోతాయి ' అంటూ పోస్ట్ చేశారు. అలాగే చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అయితే బేబీ ను ప్రీమియర్ షో చూసిన రష్మిక థియేటర్ బయటకు వచ్చే సమయంలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.
డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ చిత్రం జూలై 14న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరి మనసును కదిలించేలా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉన్నాయని.. అందరికి తమ మొదటి ప్రేమను గుర్తుచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.