అవకాశాలు లేక ఆ పని చేస్తున్న అనుపమ...!!
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది అనుపమ. తనకు సంబంధించిన ఫోటోలను, ఫన్నీ వీడియోలు బాగా పంచుకుంటుంది.నిజానికి ఆమె షేర్ చేసే ఫన్నీ వీడియోల వల్ల అల్లరి పిల్లగా పేరు సంపాదించుకుంది. ఇందులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన సోదరుడితో కలిసి ఆట పట్టిస్తున్న వీడియోలను, అంతే కాకుండా తన సినిమా షూటింగ్ సమయంలో చేసిన వీడియోలను బాగా పంచుకుంది.అప్పుడప్పుడు అందంగా రెడీ అవుతూ కుర్రాళ్ళ మనసులు దోచుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఖాళీ సమయం దొరుకుతే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటుంది.అలా ప్రతి విషయంలో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కుర్రాళ్లంతా ఈ బ్యూటీ ని క్రష్ లిస్ట్ లోకి చేర్చుకున్నారు.అలా తన విషయంలో బాగా క్రష్ చూపిస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పంచుకుంది. అందులో తను మంచి స్టైలిష్ లుక్ లో కనిపించగా.. చేతిలో చీపురు పట్టుకొని నిలబడింది.దీంతో ఆ ఫోటోలు చూసిన తన ఫ్యాన్స్.. అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది.. అడ్రస్ చెప్పు మేము వచ్చి క్లీన్ చేస్తాము అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది అయ్యో అనుపమకు సినిమాలలో అవకాశాలు రావట్లేదా.. అందుకే చేతిలో చీపురు పట్టుకొని పనిచేస్తుందా అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.